విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగుల నిరసన దీక్ష తీవ్రం
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
గడిచిన అనేక గంటలుగా ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై రాజకీయ లబ్ధి కోసం కొందరు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేస్తూ, సిబ్బంది సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.
పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు.