విజయనగరంలో కూటమి నేతల విస్తృత ప్రచారం...
విజయనగరం, సూర్య: నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పుత్సల వీధి జంక్షన్‌లో 13, 14, 15వ డివిజన్లకు సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమం విస్తృతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నదులు అనుసంధానం సంబంధించిన పూర్తిగా కార్యక్రమాన్ని బ్రష్టు పట్టించారు, ఎలక్ట్రికల్ సంబంధించిన సాలార్ ప్లాంట్స్ పూర్తిగా నాశనం చేశారు ఇవే కాకుండా ఎన్నో పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి జరగవలసినవి జరగకుండా చేశారు మరియు స్థానిక వనరులు ఎలా ధ్వంసమైందో ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో విజయనగర పట్టణానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు నిధులు ఏ విధంగా వినియోగించాము వాటిని ప్రజలకు ఎలా చేరువేసాము అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది అనే అంశము మరియు జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను, మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి తదితర స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.