BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

విజయదశమి సందర్భంగా అడ్డరోడ్డు దుర్గాదేవి కి హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు

Select Suryaa Now
విజయదశమి సందర్భంగా అడ్డరోడ్డు దుర్గాదేవి కి హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు

 

రాష్ట్రం సుభిక్షంగా వుండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనీ…

యస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ లోని శ్రీ దుర్గాదేవి అమ్మవారిని హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా హోం మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పండుగ సందర్భంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు.

చెడుపై మంచి సాధించిన విజయమే…
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు హోం మంత్రి అనితను ఘనంగా సత్కరించారు.

అంతకుముందు నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి అనిత నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పోలీసులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు, అండదండలు అందరిపై ఉండాలని వేదపండితులు దివ్య ఆశీస్సులు పొందారు.