విద్యార్థులకు విచిత్ర వేషధారణ పోటీలు
నర్సీపట్నం నవంబర్ 13 మేజర్ న్యూస్ :
పి ఆర్ టి యు ఆధ్వర్యంలో జరుగుచున్న జిల్లా స్థాయి బాలల ప్రతిభ పాటవ పోటీల్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించుట జరిగినది. ఈ పోటీలలో నర్సీపట్నం డివిజన్ పరిధిలోగల అన్ని మండలాల విద్యార్థులు సుమారు 300 మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించితిరి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి గోపీనాథ్, ఎం ఎస్ ప్రసాద్, అల్లు అప్పారావు వ్యవహరించితిరి. గత 15 రోజులుగా PRTU ఆధ్వర్యంలో జరుగుచున్న బాలల ప్రతిభ పాట పోటీల్లో విజేతలకు నేడు నర్సీపట్నం సిటీ క్లబ్ లో జరుగుచున్న బాలల దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రధానోత్సవం స్పీకర్ చింతకాయల పాత్రిగారు నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి చింతకాయల పద్మావతి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి జి జి ఎస్ నాగేశ్వరరావు చేతులమీదుగా బహుమతి ప్రదర్శన జరుగుతుందని కార్యక్రమం ఆర్గనైజర్ డి గోపినాథ్ తెలిపారు*