విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు
విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు
పరిశుభ్రతతోనే ఆరోగ్య పరిరక్షణ: కలెక్టర్ నాగరాణి
భీమవరం, మేజర్ న్యూస్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రతను పాటించడంతో పాటు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం భీమవరంలోని ఏఆర్‌కేఆర్ ఎం.పి.ఎల్. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి ప్రభావం గురించి విద్యార్థులకు వివరించారు.
భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి. భారత లక్ష్మి, జిల్లా నులిపురుగుల నిర్మూలన వైద్యాధికారి డాక్టర్ వి. క్రాంతికుమార్ ముందుగా మాత్రలు తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు మాత్రలను తీసుకున్నారు.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఓ.వి.ఎస్. అనిల్ కుమార్, మారుతినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎ. సుమా, విద్యా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం