విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండలంలోని కొండమీద కొండూరు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ను పంపిణీ చేశారు. మంగళవారంనరసాపురం గ్రామానికి చెందిన అల్లంపాటి లక్ష్మి రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి రెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోయేలా విద్యార్థుల చదువుకు తోడ్పడేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశానని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.