BREAKING
*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

విద్యార్థుల ప్రతిభకు వేదికగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.

Select Suryaa Now
విద్యార్థుల ప్రతిభకు వేదికగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.

గన్నవరం, అక్టోబర్ 1, మేజర్ న్యూస్.

స్థానిక విద్యానగర్‌లోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో గురువారం స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శిస్తూ ఉపాధ్యాయుల మాదిరిగా తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా తమ భావాలను, సృజనాత్మకతను ప్రదర్శించడం ఆకట్టుకుంది. పాఠ్యాంశాలతో పాటు నారాయణ వ్యవస్థలోని ‘ఎన్‌ లెర్న్‌ ఈ కిడ్స్‌’ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలను కూడా విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని పాఠశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ మస్తాన్‌ భాషా అభినందించారు. తమ పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ప్రిన్సిపాల్‌ రాజేష్‌, ఈ కిడ్స్‌ ఆర్‌అండ్‌డీ మారియా పాట్రిక్‌, కోఆర్డినేటర్‌ సరళా ఆలీషా, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుప్రజ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.