విద్యార్థుల ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలికలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నిరసన
భీమవరం, సూర్య న్యూస్: ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించి, జాయింట్ కలెక్టర్ కల్పనాశ్రీకి వినతిపత్రం అందజేశారు.కళాశాలకు వెళ్తున్న ఉదరగుడి రాకేష్, స్పందన, దేవరాజ్‌లను అడ్డంతన సిమెంట్ రోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో రాకేష్, స్పందన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. పోలీసుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, కళాశాల మార్గంలో వాహనాల వేగాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్లు విక్రమ్, జగదీష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా