BREAKING
పదవ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ప్రచార హోరు ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...! ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్

విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత

Select Suryaa Now
విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత

విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత: ఆంధ్రప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం :రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి ముందస్తు కార్యాచరణలో భాగంగా నగరంలోని 1వ డివిజన్ నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, 1వ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము చెప్పిందే చేస్తాం.. చేసిందే చెప్తామన్నారు. అభివృద్ధి పనులే నమ్మకానికి నిదర్శనమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నగరంలోని 42 డివిజన్ల పరిధిలో ఉన్న సిటీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా సమన్వయంతో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. 1వ డివిజన్‌లో గత రెండేళ్లలో సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. హెచ్‌ఏఎం పద్ధతిలో అభివృద్ధి పనులకు, యూఐడీఎఫ్ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు నిధులు కేటాయించామని, సంబంధిత పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మొత్తంగా మొదటి డివిజన్‌లో సుమారు రూ.23.70 కోట్లు, అంటే దాదాపు రూ.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నగరంలో సుమారు రూ.350 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. దశాబ్దాలుగా నగరాన్ని వేధిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా సుమారు రూ.230 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే చర్యలు చేపట్టామన్నారు. నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.*రూ.52 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్*క్రీడాకారులు అధికంగా ఉన్నప్పటికీ సరైన క్రీడా మౌలిక సదుపాయాలు లేని నగరంగా నగరం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చుతున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒక దశలో రూ.14 కోట్లతో పనులు ప్రారంభించగా, మరో రూ.28 కోట్ల పనులకు కూడా శ్రీకారం చుట్టామని వివరించారు. మొత్తం సుమారు రూ.42 కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయని, నగర క్రీడా అభివృద్ధికి మొత్తం రూ.52 కోట్ల స్థాయి ప్రణాళికను ప్రస్తావించారు. డంపింగ్ యార్డుల సమస్య కారణంగా దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రకటించారు. 2027 జూన్ నాటికి నగరంలో డంపింగ్ యార్డు సమస్య లేకుండా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గర్వంగా వెల్లడించారు. అలాగే 30–40 ఏళ్లుగా క్వారీ ప్రాంతంలో కొనసాగుతున్న నీటి సమస్యను సుమారు రూ.100 కోట్లతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు తీవ్రంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్ బస్టాండ్ సమస్య పరిష్కారానికి కూడా కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్‌ఆర్ నిధులు తీసుకొచ్చామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని వివరించారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. బీసీ, ఎస్సీ హాస్టళ్లను అభివృద్ధి చేశామని, ఎస్టీ హాస్టల్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లతో చేపట్టనున్న పనులకు ఇటీవల శంకుస్థాపన చేశామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం, పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని చెప్పారు. నగరంలోని బర్మా కాలనీ, సుబ్బారావుపేట, రాజేంద్రనగర్, నెహ్రూనగర్, హిమాచల్‌నగర్, ఆనంద్‌నగర్, రామదాస్‌పేట, సుబ్బారావునగర్, వన్ అండ్ టూ ప్రాంతాలు, భక్తినగర్, సంజీవినగర్ తదితర ప్రాంతాల్లో 22-ఏ భూముల సమస్యతో అనేక కుటుంబాలు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, భూమికి హక్కు లేకపోవడంతో బ్యాంకు రుణాలు పొందలేక, తమ పిల్లలకు ఆస్తులను బదిలీ చేయలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించిందన్నారు. జీవో నంబర్ 306 ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన 5,431 మందికి భూ హక్కుల సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఈ వివరాలను కరపత్రాల రూపంలో బాధిత కుటుంబాలకు అందించి ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రారంభమైన డోర్ టు డోర్ కార్యక్రమంలో నోటిఫికేషన్ వెలువడే వరకు వీలైనన్ని సార్లు ప్రతి ఇంటినీ సందర్శిస్తామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజలను కలుస్తారని చెప్పారు. ప్రతి డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని వివరిస్తామని పేర్కొన్నారు. నగరంలో సుమారు 5,000 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అందించే అంశాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలను కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలతో పాటు నియోజకవర్గ స్థాయి అభివృద్ధి వివరాలను ప్రతి ఇంటికీ చేరవేస్తామని వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ నాయకులు అనవసర గందరగోళం సృష్టించవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఎన్నికలు జరుగుతాయని, వైసీపీ నాయకులు కూడా 42 డివిజన్లలో నామినేషన్లు వేసి ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నామినేషన్లు వేయకుండా ఎవరూ అడ్డుకోవడం లేదని, ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో జరిగినట్లు ప్రచారంలో ఉన్న దాడులు, ఘర్షణల తరహా ఘటనలకు రాజమహేంద్రవరంలో తావు లేదని, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించిందని చెప్పారు. ఎన్నికల పేరుతో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇటీవల 35వ డివిజన్‌కు చెందిన వైసీపీ ఇన్‌చార్జితో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారని, ఇటీవల కొందరు జనసేనలోనూ చేరారని పేర్కొన్నారు. వైసీపీ నుంచి మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే తమకు నాయకుల చేరికల కంటే ప్రజల మద్దతు, కూటమి నాయకత్వంపై విశ్వాసమే ముఖ్యమని స్పష్టం చేశారు.

మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.