“వేస్ట్ నుంచి ఆర్ట్” కార్యక్రమం.
జంగారెడ్డిగూడెం: ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో “వేస్ట్ నుంచి ఆర్ట్” కార్యక్రమం.
"స్వచ్ఛతా హీ సేవా" కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వ్యర్థ పదార్థాల పునర్వినియోగం మరియు సృజనాత్మక వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వ్యర్థ పదార్థాలతో విద్యార్థులు వివిధ సృజనాత్మక కళాకృతులను తయారు చేసి “వ్యర్థాల నుండి కళ” కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యర్థాలను పారేయకుండా వాటిని పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్, శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పేపర్, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ సీసాలు తదితర వ్యర్థ పదార్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులను తయారు చేశారు. Reduce, Reuse, Recycle (RRR) విధానాన్ని పాటిస్తూ వ్యర్థాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు వ్యర్థాల పునర్వినియోగంపై బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు .
కెవి రమణారావు జంగారెడ్డిగూడెం