వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవానికి మంత్రి ఆనంకు ఆహ్వానం.
వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవానికి మంత్రి ఆనంకు ఆహ్వానం.
నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్:
వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అమ్మ వారి జాతర నిర్వాహకులు ఆహ్వానం పలికారు. జాతర మహోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు, వెంకటగిరి పట్టణ ప్రముఖులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు కలిసి నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నివాసానికి వచ్చి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. అక్టోబర్ 1న జరిగే అమ్మవారి నిలుపు, నగరోత్సవం, నిమజ్జనం కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి గారికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు వివరించారు.