BREAKING
కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి సర్వేపల్లి–రాపూరు యూనిట్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక జాతీయ రహదారి భద్రత మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి కార్పొరేట్ రంగంలో కొత్త నిబంధనల భారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం నీడలో సౌదీ అరేబియా 'విజన్ 2030' భవిష్యత్

వేలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న "కంచి"

Select Suryaa Now
వేలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న "కంచి"

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ వద్ద, ప్రభుత్వ వైద్యశాల వద్ద,నెల్లూరు -ముంబై జాతీయ రహదారిపై నెల్లూరు పాలెం కూడలి వద్ద స్థానిక నిత్యాన్నదాత,అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర్ రెడ్డి దాహార్తితో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు.అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోజుకు దాదాపు 700 మందికి అన్నదానం అందిస్తూ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న పరమేశ్వర్ రెడ్డి ప్రజలు ఇబ్బందిని గమనించి అత్యంత భారీ సేవా కార్యక్రమంగా తాగునీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ బస్టాండ్ వద్ద తాగునీటి సౌకర్యం గతంలో ఎవరూ పట్టించుకోనకపోగా పరమేశ్వర రెడ్డి గుర్తించి నిత్యం రాకపోకలను సాధించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ కూడా సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు నెల్లూరు ముంబై రహదారిపై నెల్లూరు పాలెం కూడలిలో కూడా తాగునీటి సరఫరా కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేశారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద రోజుకు 2000 మంది తాగునీటిని దాదాపు సగటున  500 మంది మజ్జిగను పొందుతూ దాహర్తిని తీర్చుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద కూడా ఆయన చలివేంద్రం ఏర్పాటు చేసి తాత్కాలిక షెల్టర్ను బెంచిల్ని కూడా ఏర్పాటు చేయటంతో ప్రజలకు రోగులకు వారి బంధువులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. బాగా ఇబ్బందికరంగా ఉన్న మూడు ప్రధాన కేంద్రాల్లో బృహత్తర త్రాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించి దాహార్తిని తీరుస్తున్న కంచి పరమేశ్వర్ రెడ్డి సేవా నిరతిని సర్వత్ర కొనియాడుతున్నారు. అనేక ప్రజాసంఘాల వారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.