వర్షం బీభత్సం పంటలకు అపార్ నష్టం హాయ్ బాబు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కె.గంగవరం మండలంలోని 24 గ్రామాల పరిధిలో సుమారు 16 వేల ఎకరాల్లో సాగు చేసిన తొలకరి వరి పంటకు నష్టం వాటిల్లింది. పెట్టుబడులు చేతికందక రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నష్టాల అంచనా చేపట్టారు. తహసీల్దార్ జగదీష్ వీఆర్వోలతో అత్యవసర సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో నష్టం వివరాలు సేకరించాలని సూచించారు. పంట నష్టంతో పాటు కూలిన ఇళ్లు, దెబ్బతిన్న దుకాణాలు, నేలకొరిగిన చెట్ల వివరాలను సిబ్బంది నమోదు చేస్తున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి, పరిహారం మంజూరైన తర్వాత అర్హులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
• విద్యుత్, తాగునీటికి ఇక్కట్లు
తుఫాన్ ధాటికి ట్రాన్స్‌కో పరిధిలో సుమారు 100 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు, లైట్లు చోరీకి గురైనట్లు సమాచారం.విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టారు.విద్యుత్ అంతరాయంతో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.జనరేటర్లు ఏర్పాటు చేసి పబ్లిక్ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరోవైపు ఎంపీటీసీ అభ్యర్థులు ఇళ్లు, కాలనీల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.