వైసిపి వీడిన పాలగిరి ఖాజా టిడిపి లో చేరిక
ప్రొద్దుటూరు అక్టోబర్ 18 మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పురపాలక సంఘం 26వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు పాలగిరి ఖాజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ కండువా వేసి పాలగిరి ఖాజాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాలగిరి ఖాజా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చుతూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందానని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఇతర కారణాల చేత ఆ పార్టీ నుండి వైదొలగడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో పట్టణం సరవేగంగా అభివృద్ధి చెందడం తనకేంతో స్పూర్తి ఇచ్చిందన్నారు. పెద్దాయన తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు. తన నివాసం నుండి 100 మందితో బైకులలో ర్యాలీగా వచ్చి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాలగిరి ఖాజా తో పాటు తెలుగుదేశం పార్టీలో ఖాదర్ వలీ, షఫీ, ఫక్రుద్దీన్ గంగాధర్ మున్నా రఫీ ఖాదర్ బాషా మహబూబ్ బాషా, సురేష్ మరి కొంతమంది పార్టీలో చేరినట్టు పాలగిరి ఖజా తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌస్, 26వ వార్డు టిడిపి ఇంర్జ్ నూరి, ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా