వైసీపి వీడి 7 కుటుంబాలు టీడీపి లో చేరిక
వైసీపి వీడి టిడిపిలో 7 కుటుంబాలు చేరిక
కనిగిరి ,మేజర్ న్యూస్ :హనుమంతునిపాడు మండలం హనుమంతాపురం గ్రామానికి చెందిన 7 కుటుంబాలు మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపి వీడి ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో సోమవారం టీడీపి లో చేరారు .పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే పార్టీ కండువాలు మేడలో వేసి సాదరంగా ఆహ్వానించారు .కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ,కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు చూసి వైసీపి వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఎమ్యెల్యే తెలిపారు .పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు .టిడిపి చేరిన వారిలో బత్తుల గురవయ్య ,కేతిబోయిన చెన్నయ్య ,నలికినీడి మార్కు ,అబ్రహం ,జమ్ముల భాస్కర్ ,దేశినేని చిన్న వీరయ్య తదితరులు ఉన్నారు .