వైకాపా సభ్యత్వ ఐడీ కార్డుల పంపిణీ
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు జెట్టి గురునాథరావు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు పాల్గొని నాయకులకు సభ్యత్వ ఐడీ కార్డులు అందజేశారు.తొలి కార్డును పట్టణ అధ్యక్షుడు కర్పూరం గౌరయ్య గుప్తకు, రెండో కార్డును పట్టణ మహిళా అధ్యక్షురాలు తాడేపల్లి ఉమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా విజయరాజు, గురునాథరావు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు గర్వకారణమన్నారు. సభ్యత్వంతో కార్యకర్తలకు రూ.5 లక్షల వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, పంతగాని వెంకన్న, అయినాల రమణమూర్తి, ముప్పిడి వీరాంజనేయులు, మహమ్మద్ ఉమర్ షరీఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
కే వి రమణ రావు జంగారెడ్డిగూడెం