వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ధర్మాన కృష్ణ చైతన్య ప్రచారం
నరసన్నపేట/పోలాకి, సూర్య : నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైయస్ఆర్సీపీ,జడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలుపుకు యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఇంటింటా తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభిస్తుంది. శనివారం పోలాకి, పల్లిపేట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలాకి ఎంపీటీసీ-1 అభ్యర్థి బుచ్చి సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ-2 అభ్యర్థి బుస సురేంద్రరెడ్డికి మద్దతుగా ఆయా ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు.