వాడపల్లి వెంకన్న ఆలయానికి 1000 కేజీలు పచ్చళ్ళు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాదంతో పాటు పచ్చళ్లు అందించాలనే ఉద్దేశంతో కొమరారం గ్రామానికి చెందిన రెల్లీ వెంకటేశ్వరరావు, దుర్గా దంపతులు ఏడు రకాల పచ్చళ్లను 1000 కేజీలు ఆలయానికి అందజేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణలో పచ్చళ్లను కూడా అందించాలనే ఉద్దేశంతో వారు ఈ విరాళాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు వేదమంత్రాల నడుమ స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను వారికి అందజేశారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సోమవారం ప్రముఖ కోలాట కళాకారుడు సతీష్ రామానుజ తన బృందంతో కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తి భావంతో, అద్భుతమైన సమన్వయంతో ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి సన్నిధిలో సంప్రదాయ కళను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ కళారూపాల ద్వారా భక్తిభావాన్ని చాటిచెప్పిన కోలాట ప్రదర్శన భక్తులను అలరించింది.