ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలి
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ల సమస్యలు పరిష్కరించాలి.
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
నియోజకవర్గంలోని రుద్రవరంలో
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ భాగ్యలక్ష్మి కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు నెలకు కేవలం రూ. 5745 వేతనం మాత్రమే ఇస్తున్నారని, కుటుంబ పోషణ కష్టంగా మారినందున కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ తొలగింపులను అరికట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని, 7500 మ్యాన్ డేస్ విధానాన్ని రద్దు చేసి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎఫ్.టి.ఇ వర్తింపజేయాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న జూన్ నెల జీతం ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన లేదా అంగవైకల్యం పొందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటితో పాటు యాప్ ల వినియోగానికి కొత్త మొబైల్స్, 5జిబి సిమ్ కార్డ్స్, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, పదోన్నతులు, మండల స్థాయి బదిలీ సౌకర్యం కల్పించాలని కోరుతూ, తమ న్యాయమైన డిమాండ్లను అక్టోబర్ 5వ తేదీ లోపు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని కోరారు.