ఉప ఖజానా కార్యాలయం' ప్రారంభించినవిప్ నాయకర్
నరసాపురం, మేజర్ న్యూస్ :స్థానికసబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 'ఉప ఖజానా కార్యాలయాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికే ఈ నూతన కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ, జవాబుదారీతనంతో కూడిన సేవల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా