తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కొవ్వాసు జగదీశ్వరి
పోలవరం, మేజర్ న్యూస్ : ఆర్నాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి.పోలవరం నియోజకవర్గంలోని ప్రగడపల్లి పంచాయతీ పరిధిలో ఆర్నాబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.