తుఫాన్ బాధితులకు సాయం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅర్నాబ్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. రావులపాలెం మండలంలోని ఊబలంక, రావులపాలెం, రావులపాడు గ్రామాల్లో గత రెండు రోజులుగా బాధితులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.గురువారం చిన్నారులు, వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు మఫ్లర్లను పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఆహారం, అవసరమైన వస్తువులు అందించి తమ వంతు సహాయం చేశారు. కార్యక్రమంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ మోహిత్ సీత, శ్యామ్ అన్నపూర్ణ, ఊబలంక పంచాయతీ కార్యదర్శి సర్వరాజు, వీఆర్వో లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు.