తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు
తిరుపతి, రెవెన్యూ ,మేజర్ న్యూస్.
తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం
విజయవంతంగా ఎన్నికల ప్రచారం..
తొండవాడ: చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి కె. భువనేశ్వరి ఎన్నికల ప్రచారం విజయవంతంగా సాగింది. ప్రచారంలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అభ్యర్థికి గ్రామస్థులు, మహిళలు, ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆమె మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన, ఆత్మీయ స్వాగతం ప్రచార కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని అందించాయి.
ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో కనిపించిన ప్రజాదరణతో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి