BREAKING
రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు

తెరుచుకోని అంగన్వాడీ కేంద్రం..

Select Suryaa Now
తెరుచుకోని అంగన్వాడీ కేంద్రం..


- సూపర్వైజర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.
- ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్న సూపర్వైజర్..
- ఇన్చార్జ్ పి ఓ పర్యవేక్షణా లోపం కారణమని ఆరోపణలు ..

నరసన్నపేట, నవంబర్ 13 మేజర్ న్యూస్:
నరసన్నపేట మండలం కరగాం పంచాయతీ పరిధిలోని నర్సింగపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం గురువారం తెరుచుకోకపోవడంపై గ్రామస్తులు సంబంధిత సూపర్వైజర్ రమణమ్మకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక సంరక్షణ కల్పించాల్సిన అంగన్వాడీ కేంద్రం పనిచేయకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామస్తుల ఆరోపణల ప్రకారం.. అంగన్వాడీ కార్యకర్త  ఫేస్ యాప్‌లో హాజరు నమోదు చేసినప్పటికీ, కేంద్రాన్ని తెరవకుండా మూసివేశారు. దీంతో కొందరు గ్రామస్తులు కేంద్రం మూసివేసి ఉన్న దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి సూపర్వైజర్ రమణమ్మకు పంపిస్తూ ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై స్పందించిన సూపర్వైజర్ రమణమ్మ.. నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి విషయం తెలియజేసి, తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రం తెరుచుకొని విషయాన్ని నరసన్నపేట ఐసిడిఎస్ పి ఓ కు వివరణ కూడా ఎందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. సూపర్వైజర్ రమణమను వివరణ కోరగా గ్రామస్తులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, విషయాన్ని పిఓ కి తెలియజేశానని, ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే  చర్యలు తీసుకుంటామన్నారని ఆమె అన్నారు..