విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత
అవనిగడ్డ: మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావును అవనిగడ్డలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విక్కుర్తిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, స్థానికంగా చేపడుతున్న కార్యక్రమాలపై వారు విక్కుర్తితో చర్చించారు. పార్టీ బలోపేతానికి యువత మరింత చురుగ్గా పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విక్కుర్తి సూచించినట్లు తెలిపారు.
మోపిదేవిలంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలుగు యువత ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.