టీడీపీలోకి 20 కుటుంబాలు...
- పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట నవంబర్ 13 మేజర్ న్యూస్:
నరసన్నపేట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు బొత్స మహేష్, యారబాటి రాంబాబు, జమ్మూ సూర్యనారాయణ, చౌడాడ కోటీశ్వరరావు, సాకేటి రమణ, సాకేటి అమ్మారావు, తూలుగు శ్రీనివాసరావుతో పాటు మొత్తం 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోగా, ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చనతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వరుసగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతుండటంతో నరసన్నపేట మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.