BREAKING
హెచ్‌సీఎల్‌టెక్ జోరు: పూర్తి స్థాయి రాబడి వృద్ధి అంచనా (గైడెన్స్) 2.5–4 శాతానికి పెంపు.. ఎబిట్ మార్జిన్ల ఔట్‌లుక్ యథాతథం! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిన్న వయసులోనే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. మన జీవనశైలిలో జరుగుతున్న తీవ్రమైన పొరపాట్లు ఇవే! బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం

తలసేమియా బాధిత గిరిజన చిన్నారుల కోసం యాక్సిస్ బ్యాంక్ రక్తదాన శిబిరం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా స్వచ్ఛంద రక్తదానం.. దాతలను అభినందించిన రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ

Select Suryaa Now
తలసేమియా బాధిత గిరిజన చిన్నారుల కోసం యాక్సిస్ బ్యాంక్ రక్తదాన శిబిరం  సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా స్వచ్ఛంద రక్తదానం.. దాతలను అభినందించిన రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ

భీమవరం, సూర్య  న్యూస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా భీమవరం చినమిరంలోని యాక్సిస్ బ్యాంక్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్నవారితో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తరచూ రక్తం అవసరమయ్యే బాధితులకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ రక్తదాతలను అభినందించారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం గిరిజన ప్రాంతాల్లోని తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధిత చిన్నారులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడే రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు డి. వెంకటపతిరాజు, ఎం. శివరామకృష్ణ, బ్యాంకు సిబ్బందితో పాటు సహకారం అందించిన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ సీహెచ్ శ్రీనివాసరావు సహకారం అందించారు. గొట్టుముక్కల వెంకట భీమరాజు, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, గౌతమ్ చక్రవర్తి, వాడపల్లి రమేష్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా