స్వచ్ఛ రథం విజేతలు వీరే.
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరు మండల పరిధిలో స్వచ్ఛ రథం ఆధ్వర్యంలో ఇప్పటివరకు సేకరించిన తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంలో గృహస్తులు అందించిన తడి చెత్త పొడి చెత్త సంబంధించి లాటరీ వేశారు లాటరీలో స్థానిక ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ఎంపీడీవో కే రామారావులు సమక్షంలో సిబ్బంది తీసిన లాటరీలో విజేత లైనవారు ఇందిరా నగర్ కాలనీకి చెందిన రాధా దేవిసేన మొదటి బహుమతి సాతాను వారి పాలెం చెందిన రవి ద్వితీయ బహుమతి ఇందిరా నగరకు చెందిన రాగి లక్ష్మీదేవి తృతీయ బహుమతి మరియు ఏడుగురు కన్సోలేషన్ బహుమతులకు ఎంపికైనట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో స్వచ్ఛ గ్రామంగా తయారు చేసేందుకు ప్రతి ఇంటి గృహస్తులు సహకరించి తన ఇంటిలోని తడి చెత్త పొడి చెత్తను అందించి వారికి అవసరమైన సామాగ్రిని తీసుకోవడం సంతోషదాయకమన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారాన్ని అందించి ఆయా పంచాయతీలను ఆరోగ్యవంతంగా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు విజేత లేని వారికి అభినందనలు తెలియజేశారు.