BREAKING
కూటమినేతలంతా కలిసికట్టుగా ఉన్నాం... అపోహలు నమ్మద్దు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: మాజీ మంత్రి హరీశ్ రావు దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి విజయదశమి, దసరా సందర్భంగా సిద్దిపేట ప్రజలకు పూజల హరికృష్ణ శుభాకాంక్షలు రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులకు మద్దతివ్వాలి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ పాలపిట్టను కాపాడుకుందాం.. ప్రకృతిని సంరక్షిద్దాం:జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) విశాల్ బత్తుల, ఐఎఫ్‌ఎస్‌ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో 25 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక.. అప్పాజీపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు దుర్గామాత విగ్రహాన్ని అందజేసిన ధనరాజ్ ముదిరాజ్ చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయం మహిళల్లో చైతన్యం నింపిన ‘అక్షర రంగవల్లులు’ కార్యక్రమం ఘనంగా దుర్గా మాత హోమం

స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దు

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దు

విజయనగరం, సూర్య :  స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్  పిలుపునిచ్చారు. విజయనగరం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వి.టి.అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన 'సద్భావన' కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలతో మమేకమయ్యారు.

జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - స్థానిక సంస్థలను ప్రశాంతయుతంగా నిర్వహించుకోవడం మనందరి బాధ్యతన్నారు. ఎన్నికల్లో ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో నమోదయ్యే క్రిమినల్ కేసులను తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. అటువంటి వ్యక్తులపై రౌడీ షీట్లును కూడా ప్రారంభించి, వారి కదలికలపై నిఘా పెడతామన్నారు. రాజ్యాంగ బద్దమైన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కారణంగా తగువులు, గౌడవలు పడవద్దని, ప్రతీ ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. క్రిమినల్ కేసులు నమోదయ్యే వ్యక్తులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను పొందే క్రమంలో నిర్వహించే పోలీసు వెరిఫికేషనులో ఎవరిపైన అయినా క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే ఉద్యోగాలు పొందే అవకాశాలు కోల్పోతారన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళికల అనుగుణంగా నడుచుకోవాలని, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ప్రజలెవ్వరూ ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.10 వేలుకు మించిన నగదును తమ వెంట తీసుకొని వెళ్ళవడ్డన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టే తనిఖీల్లో డబ్బులు పట్టుబడితే వాటిని సీజ్ చేస్తామన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ఆధారాలు, పత్రాలతో మాత్రమే తమ అవసరాలకు తగిన నగదును తీసుకొని వెళ్ళాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టవద్దని, రాత్రి 10 గంటల తరువాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులకు సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ కోరారు.

అనంతరం, మహిళలు, ప్రజలతో జిల్లా ఎస్సీ మమేకమై పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, గంజాయి, మద్యం, ఇతర మాదక ద్రవ్యాల ప్రభావానికి గురికాకుండా చూడాలన్నారు. మహిళలు, బాలల భద్రతకు శ్రద్ధ వహించాలని, మైనరు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. అదే విధంగా రహదారి భద్రతను ప్రతీ ఒక్కరూ పాటించే విధంగా చూడాలని, ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలన్నారు. మన తప్పు లేకున్నా రహదారి ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. ఒక కుటుంబ యజమాని రహదారి ప్రమాణాల్లో అర్ధంతరంగా మరణిస్తే ఆ కుటుంబం కకావికలం అవుతుందని, చదువుకోవాల్సిన పిల్లలు కూలీలుగా మారే పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. కావున, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు వారి పిల్లలను, ఇంటి యజమానులను గంజాయి, మద్యం జోలికి పోకుండా, హెల్మెట్ ధరించే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ ఎస్ఐ వి.ప్రసాదరావు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.