BREAKING
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మద్యం అరికట్టాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మద్యం అరికట్టాలి

 

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చమకూరి శ్రీధర్

శ్రీకాకుళం,నవంబరు,13 మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీ మీ జిల్లాల్లో అక్రమ మద్యం, బెల్టు షాపులు, ఇతర ఎక్సైజ్ నేరాలను అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చమకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తో కలసి గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లా అధికారులతో శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో అక్రమ మద్యం, బెల్టు షాపులు, ఇతర ఎక్సైజ్ నేరాలను అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, అక్రమ మద్యం, నాటు సారా, బెల్ట్ షాపులు, ఇతర ఎక్సైజ్ నేరాలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా, ఆకస్మిక తనిఖీలు మరియు దాడులు నిర్వహించాలన్నారు.

రెవెన్యూ వృద్ధి:

రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వృద్ధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, లైసెన్సు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అక్రమ మద్యం విక్రయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

శ్రీకాకుళం IMFL డిపో తనిఖీ:

సమావేశానంతరం అధికారులు శ్రీకాకుళం ఐఎంఎఫ్ఎల్ డిపోను తనిఖీ చేశారు. డిపోలో స్టాక్ నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. మద్యం దుకాణాలకు సకాలంలో, ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సాధారణ ఆదేశాలు:

అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలని, ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా  ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు సుర్జీత్ సింగ్,  శ్రీనివాస చౌదరి, అసిస్టెంట్  కమిషనర్లు మనోహ, రామచంద్రరావు, ఎక్సయిజ్ సూపరింటెండెంట్లు  తిరుపతి నాయుడు, శ్రీనాధుడు, సహదేవుడు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఐఎంఎఫ్ఎల్ డిపో మేనేజర్ జయసింహ చౌదరి, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.