స్థానిక సంస్థల ఎన్నికలకు 74 మంది మైక్రో అబ్జర్వర్ల కేటాయింపు
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్ల కేటాయింపు ప్రక్రియను మంగళవారం నెల్లూరులో ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో రాండమైజేషన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఆత్మకూరు మున్సిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నెల్లూరు నగరపాలక సంస్థలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్ల కేటాయింపును చేపట్టారు. మూడు పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం 74 మంది మైక్రో అబ్జర్వర్లు అవసరం కాగా, ఇందులో 62 మందిని ప్రధాన కేటాయింపునకు, 12 మందిని రిజర్వ్‌గా కేటాయించారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి 14 మంది, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి ఐదుగురు, నెల్లూరు నగరపాలక సంస్థకు 55 మంది చొప్పున మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఓ లక్ష్మీ నరసింహం, ఏపీఐఐసీ జెడ్ ఎం శివకుమార్, శోభారాణి, ఎన్ఐసి సభ్యులు తదితరులు ఉన్నారు.