BREAKING
దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు! మాంచెస్టర్ సినగాగ్ దాడి ఘటనపై బ్రిటన్ బహిరంగ విచారణ ప్రముఖుల భద్రతపై బ్రిటన్ సమీక్ష...మాజీ మంత్రి హత్య నేపథ్యంలో కీలక నిర్ణయం ఆర్‌బీఎల్ బ్యాంక్ క్యూ2 లాభాల్లో భారీ జంప్: 170 శాతం వృద్ధితో రూ. 482 కోట్లకు చేరిన నికర లాభం.. మెరుగుపడిన ఆస్తి నాణ్యత! తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియామకం యూరోపియన్ యూనియన్‌కు 5,841 టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతి: టీఆర్‌క్యూ కింద రాయితీ సుంకంతో ఎగుమతులు!

స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. చెన్నంపల్లి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన రూరల్‌ ఏఎస్పీ అశ్విన్‌ మణిదీప్‌

Select Suryaa Now
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు  శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు  సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. చెన్నంపల్లి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన రూరల్‌ ఏఎస్పీ అశ్విన్‌ మణిదీప్‌

అనంతపురం బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అనంతపురం రూరల్‌ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ అశ్విన్‌ మణిదీప్‌ ఐపీఎస్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోమవారం బుక్కరాయసముద్రం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన ఏఎస్పీ.. మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలకు చెందిన పలువురిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పోలీసు శాఖకు సహకరించాలని ఏఎస్పీ కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై, వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతపై ఆరా

అనంతరం చెన్నంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఏఎస్పీ అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బుక్కరాయసముద్రం సీఐ ఎం. సుబ్బరాయుడు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.