BREAKING
రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు... జాహ్నవికి అఖండ విజయం అందించండి జనసందోహంతో దద్దరిల్లిన బుజబుజ నెల్లూరు - వేలాదిమందితో భారీ ర్యాలీ ఆరు నెలల క్రితమే వివాహం.. వివాహిత ఆత్మహత్య బైరెడ్డి జాహ్నవిని అఖండ మెజారిటీతో గెలిపించాలి సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి బాటలు వేయండి* అలియాబాద్‌లో బఫర్‌ జోన్‌లో భారీ షెడ్‌ నిర్మాణంపై ఆరోపణలు.. అనుమతులపై అధికారుల విచారణ ఏదీ..? ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు సత్కారం

స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం

Select Suryaa Now
స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం

నెల్లూరు ,  మేజర్ న్యూస్ :  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వెంకటాచలం మండలం పుంజులూరుపాడు, తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ ఆమలూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో జడ్పీటీసీ అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించినా నెల్లూరు జిల్లాలో మాత్రం జాప్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా జాబితా ప్రకటించకపోవడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.  సర్వేపల్లి నియోజకవర్గంలోని 79 ఎంపీటీసీ, ఐదు జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలో నిలిపామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అత్యధిక స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ప్రతిపక్ష అభ్యర్థులను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధమవుతామన్నారు.