BREAKING
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్ ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం

*సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్‌* *క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పీజీఆర్‌ఎస్‌పై అభిప్రాయాన్ని నమోదు చేసుకోవచ్చు* *జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరీ

Select Suryaa Now
   *సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం  పీజీఆర్‌ఎస్‌*   *క్యూఆర్‌ కోడ్‌ ద్వారా  పీజీఆర్‌ఎస్‌పై అభిప్రాయాన్ని నమోదు చేసుకోవచ్చు*  *జిల్లా కలెక్టర్‌  డా.ఏ.సిరీ

కర్నూలు, అక్టోబర్ 03:- ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమాన్ని  సోమవారం కలెక్టరేట్‌ లోని సునయన ఆడిటోరియంలో,రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో  నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి  తెలిపారు.


*క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్*

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం  క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో తమకు అందిన సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు.
మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన అనంతరం తెరుచుకునే పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రతి  సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల కార్యాలయాల్లోనూ నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు అందించండి, వాటిపై మీ స్పందనను  క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయండి అని జిల్లా కలెక్టర్ కోరారు.