శ్రీవారి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ మోహిని దేవి అలంకరణ మహోత్సవం
శ్రీ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం నాడు స్వామివారికి శ్రీ మోహిని దేవి అలంకరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.శ్రీ మోహిని దేవి అలంకరణలో అత్యంత సుందరముగా, రకరకాల పుష్పాలతో అలంకరించి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆస్థానం గావించారు. ఆలయ ప్రధాన అర్చకులచే స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తాదులు పాల్గొని గోవింద నామస్మరణతో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ మోహిని దేవి అలంకరణ ఉత్సవాలలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి పాల్గొని, ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు కల్పించారు.