శ్ర శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికలు రేసులో కీర్తి పాటి చంద్ర రాజు బరిలో దిగుతున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. చంద్ర రాజు 2013 సంవత్సరం నుండి వైయస్సార్ పార్టీకి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో రాజులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాజులకు అవకాశం ఇవ్వడం వలన శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పలువురు విశ్లేషకులు తెలియజేశారు. వైయస్సార్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం ఎన్నికలలో అన్ని వర్గాల ఓటర్లు, ప్రధానంగా రాజులు సహకారంతో కె చంద్ర రాజు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తుంది.