BREAKING
భారతదేశంలో భారీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌పై వ్యతిరేకత..మునిగిపోతున్న ఇళ్లు, ఆలయాలు ఢిల్లీలోని 11 జిల్లాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్': ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక! డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై అమెరికా కోర్టు తీర్పు... ట్యాక్స్ పేయర్ల డబ్బుతో ప్రచారానికి బ్రేక్ బ్రిటన్‌కు కృత్రిమ మేధ మోడళ్ల సేఫ్టీ టెస్టింగ్ అనుమతి.. వైఖరి మార్చుకున్న ట్రంప్ ప్రభుత్వం ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి: ఇద్దరు భారత నావికులు గల్లంతు.. 9 మంది సురక్షితం! రియాద్ విమానాశ్రయం దాడిలో గాయపడిన భారతీయుడు మృతి: తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్! ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు.. తొమ్మిది మంది క్షేమం! షాపింగ్ కోసం క్రెడిట్ కార్డు ఫొటోలు గ్రోక్‌కు పంపండి: ఎలాన్ మస్క్ సూచనపై భగ్గుమన్న ప్రైవసీ ఆందోళనలు! పాకిస్థాన్‌లో చట్టబద్ధ పాలన లేదు.. సైన్యమే చట్టం: ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఘాటు విమర్శలు! 'సూపర్ ఇంటెలిజెన్స్' దెబ్బకు కాల్ సెంటర్ ఉద్యోగాలు కనుమరుగు: ఎలాన్ మస్క్ సంచలన జోస్యం! ఎలుగుబంటి దాడి నుంచి బాలుడిని కాపాడిన స్మార్ట్‌ఫోన్: కొరకగానే పేలిన బ్యాటరీ.. రష్యాలో విచిత్ర సంఘటన! ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ పాలన: ఇమ్రాన్ ఖాన్ పీటీఐ ప్రభుత్వాన్ని రద్దు చేసిన షెహబాజ్ షరీఫ్.. భగ్గుమన్న పఖ్తూన్ ప్రాంతం! నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఆకస్మిక వరదల బీభత్సం: ఐదుగురు గల్లంతు.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు! ఇంధన ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ కారణం కాదు.. హోర్ముజ్ సంక్షోభమే మూలం: జెలెన్‌స్కీ స్పష్టీకరణ! రియాద్ విమానాశ్రయంపై దాడి ఘటనలో హైదరాబాదీ మృతి: భార్య, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు.. ఉమ్రా యాత్రలో తీవ్ర విషాదం!

మంగొల్లులో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల సమావేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: తన్నీరు నాగేశ్వరరావు

Select Suryaa Now
మంగొల్లులో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల సమావేశం  పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: తన్నీరు నాగేశ్వరరావు

వత్సవాయి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మంగొల్లు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సమావేశం, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో ఉన్న లోపాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రజలకు గుర్తుకొస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిందని పేర్కొన్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజల పక్షాన నిలవాలని కోరారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొల్లం కిరణ్, మన్నే పాపయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు శరణం కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్ మెట్టిల వెంకటేశ్వర్లు, సింగాల వెంకటేశ్వర్లు, అన్నేపాక రత్నం, జెట్టి ప్రసాద్, జెట్టి శ్రీను, పాపగంటి ప్రవీణ్, గుంటూరు ఏడుకొండలు, షేక్ గురునాథం, షేక్ సైదులు, అన్నేపాక దాస్, దేవుడు ప్రసాద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.