BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్

Select Suryaa Now
శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్

అయినవిల్లి మేజర్ న్యూస్ :బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలో  వేంచేసియున్న  శ్రీ విఘ్నేశ్వర స్వామి  ఆలయం వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో భక్తులకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయినవిల్లి గ్రామం నుండి ముక్తేశ్వరం వరకు రోడ్డు పొడవునా ఆక్రమణలు కారణంగా గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి ప్రస్తుత ట్రాఫిక్ కి అనుగుణంగా రోడ్డు వెడల్పు చేయలేదు ఆలయం వద్ద  అన్నదానం బిల్డింగ్ ప్రక్కన వ్యాపార దుకాణాలు కారణంగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువైoది దేవస్థానం పట్టించుకోవట్లేదని భక్తులు ఆరోపిస్తున్నారు .

వ్యాపార సంస్థల వద్ద మోటార్ సైకిల్ చిన్న కార్లు పక్కనే నిలిపివేయటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి గత కొద్ది సంవత్సరాలుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది సెలవు రోజుల్లోనూ పర్వదినాలలోనూ వేలాదిగా భక్తులు తరలిరావడంతో అయినవిల్లి గ్రామం అంతా వాహనాలతో నిండిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దేవస్థానం గాని ఆర్ అ&బి అధికారులు గాని పంచాయితీ గాని ట్రాఫిక్ సమస్యపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడo లేదని భక్తుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. 

ఆలయానికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ఒక సమస్యగా మారింది గత నెల నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు అయింది  ప్రమాణస్వీకారం చేసిన ఆలయ కమిటీ తక్షణం స్పందించి ఆక్రమణలు తొలగింపునకు చర్యలు తీసుకోవాలని రోడ్డు వెడల్పు చేయించాలని  భక్తులు కోరుతున్నారు అయినవిల్లి మండలం ముక్తేశ్వరం నుండి కొత్తపేట మండలం రావులపాలెం వరకు ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

సెంట్రల్ డెల్టాక్ బ్యాంకు కెనాల్ పొడవునా చింతన లంక లాకు నుండి ముక్తేశ్వరం వంతెన వరకు కాలువ గట్టు రోడ్డు ఆక్రమణ గురై అభివృద్ధికి నోచుకోలేదు దీంతో సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది ప్రజా ప్రతినిధులు దేవస్థానం అధికారులు చర్యలు తీ సుకుని వానపల్లి పల్లాలమ్మ ఆలయం వద్ద ఆక్రమణలు తొలగించిన రీతిలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్లు ఆక్రమణలు  తొలగించాలని భక్తులు కోరుతున్నారు నూతన పాలకమండలి సంబంధిత శాఖలకు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరవలసి ఉంది