*శ్రీ మఠం మేనేజర్‌కు గౌరవ డాక్టరేట్
**మంత్రాలయం,సూర్య ప్రతినిధి,* కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.కె. శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన మైల్స్ లీడర్‌షిప్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది.యువత అభివృద్ధి, ప్రవర్తనా మార్పు, విద్యా పరిశోధన, సాంస్కృతిక రంగం, వ్యవస్థాపకత, నాయకత్వం, సమాజ సేవ వంటి పలు రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్‌షిప్ గౌరవ పట్టాను అందించనున్నారు. ఈ మేరకు నవంబర్ 29న జరిగే కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.
శ్రీనివాసరావుకు ఈ గౌరవం లభించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. *నాగరాజు, సూర్య ప్రతినిధి, మంత్రాలయం, కర్నూలు జిల్లా.*