శ్రీ కోటదుర్గమ్మ హుండీల ఆదాయం రూ.4. లక్షలు
పాలకొండ, మేజర్ న్యూస్ ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి హుండీ లను తెరిచి బుధవారం లెక్కించారు. మొత్తం రూ. అక్టోబర్ 23 నుండి నవంబర్ 25 వరకు 34 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా 4,05,396 (అక్షరాలా) నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు.జగన్నాథ స్వామి దేవస్థానం ఈవో కె.పరమేశ్వరి పర్యవేక్షణ లో జరిగింది.ఆలయ ప్రధాన ఆర్చకులు దార్లపూడి లక్ష్మి ప్రసాద్ శర్మ, జూనియర్ అసిస్టెంట్. శ్రీనివాస శర్మ, ఆలయ పూజారులు, సిబ్బంది, ఏపీజీ బ్యాంక్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.