BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

శ్రీ బాలా త్రిపురసుందరిగా ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం

Select Suryaa Now
శ్రీ బాలా త్రిపురసుందరిగా ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం

జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్, పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ఆదిత్య మిశ్ర పర్యవేక్షణలో, విజయ పవన్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నిత్యార్చన, ప్రత్యేక హారతులతో పాటు పసుపుకొమ్ములతో అర్చన, కుంకుమార్చన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ, సర్వత్రా వ్యాపించి సమస్త జీవరాశికి శక్తిని అందించే ఆదిపరాశక్తి వివిధ నామరూపాలతో అవతరించిందని, అందులో శ్రీ బాలా త్రిపురసుందరి అవతారం విశిష్టమైనదని తెలిపారు. అమ్మవారికి పసుపుకొమ్ములతో అర్చన చేయడం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.సోమవారం ప్రసాదాన్ని చింతా నాగరాజు, నాగమణి దంపతులు, అమ్మవారి అలంకరణను చీమకుర్తి శ్రీనివాస్, వరలక్ష్మి దంపతులు, బాలా త్రిపురసుందరి పూజను కొండా రాము, శ్రీదేవి దంపతులు సమర్పించారు.మంగళవారం మూడవ రోజు ఉత్సవాల్లో భాగంగా ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పంచవర్ణ గాజులతో అర్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా