శిథిలావస్థలో వాడాడ పశువైద్యశాల.. పట్టించుకునేదెవరు?
వాడాడలో నూతన భవనానికి ఎదురుచూపులు.. బాడంగిలో కుంగిన నేల టైల్స్
బాడంగి, నవంబరు 12 (మేజర్ న్యూస్):
మండలంలోని పశువైద్యశాలల నిర్వహణపై నిర్లక్ష్య ఛాయలు కనిపిస్తున్నాయి. వాడాడలో పశువైద్య చికిత్సాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా, బాడంగిలో 2020లో నూతనంగా నిర్మించిన భవనంలోని నేల టైల్స్ కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పశువైద్య సిబ్బంది విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాడంగి పశువైద్యాధికారి ఎం. సతీష్‌కుమార్ నాయుడు సైతం దెబ్బతిన్న నేలపై కుర్చీ వేసుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
2020 డిసెంబరు 22న అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన బాడంగి పశువైద్యశాల భవనం రూ.30.50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించగా, ఐదేళ్ల పది నెలలకే నేల టైల్స్ కుంగిపోవడం నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరోవైపు, నియోజకవర్గంలోని పశువైద్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాలని ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాడాడలో నూతన పశువైద్యశాల భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో పాటు, బాడంగిలో దెబ్బతిన్న టైల్స్‌కు తక్షణ మరమ్మతులు చేపట్టాలని పాడి రైతులు కోరుతున్నారు.