సీఎం చంద్రబాబుకు పశ్చిమలో ఘన స్వాగతం
సీఎం చంద్రబాబుకు పశ్చిమలో ఘన స్వాగతం
విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్): పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కెనాల్ రోడ్డులో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి కేదారేశ్వరీపేట మజీద్ సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ హబీబ్ నాయకత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పార్టీ జెండాలు చేతబూని, నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.