సర్పంచ్ ల ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఏర్పాటు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మండలం నందు జరగబోయే 21 గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు
వార్డ్ మెంబర్ల ఎన్నికల కోసం ఆత్మకూరు మండలంలో(7) నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపిడివో పి. రఫీఖాన్ తెలిపారు.
బట్టేపాడు స్వర్ణ గ్రామం నందు బట్టేపాడు మరియు అప్పారావు పాలెం పంచాయతీలవారు,
చెర్లో ఎడవల్లి స్వర్ణ గ్రామం నందు చెర్లోఎడవల్లి, నారంపేట, నాగులపాడు, రావులకొల్లు పంచాయతీలవారు,
దేపూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు దేపూరు, బండారుపల్లి, నువ్వురుపాడు పంచాయతీల వారు,
కరటంపాడు స్వర్ణ గ్రామం నందు కరటంపాడు, పడకండ్ల, వెన్నవాడ, ఆరవీడు పంచాయతీలవారు,
మురగళ్ళ స్వర్ణ గ్రామం నందు మురగళ్ళ, నల్లపురెడ్డిపల్లి, కనుపూరు పల్లి పంచాయతీలవారు,
మహిమలూరు స్వర్ణ గ్రామం నందు మహిమలూరు మరియు రామస్వామి పల్లి పంచాయతీలవారు,
ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు పమిడిపాడు, బోయళ్ళ చిరువెళ్ల మరియు వాసిలి పంచాయతీలవారు
సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లకు పోటీపడే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించుకోవచ్చు అని ఆయన తెలియజేశారు.
నామినేషన్లు నవంబర్ నెలలోని 18, 19, 20, తేదీలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడునని,
నామినేషన్ల పరిశీలన
21.11.26 చేపట్టబడునని,
తిరస్కరణకు గురైన నామినేషన్లపై రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆత్మకూరు వారి వద్ద తేదీ 22 న అప్పీలు చేసుకొనవచ్చునని,
సదర్ అప్పీలు డిస్పోసల్ 23న జరుగునని ఆయన తెలిపారు.
నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 24 మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందన్నారు.
పోలింగ్ తేదీ ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగునని, కౌంటింగ్ అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పూర్తయ్యేంతవరకు జరుగుతుందని, రిజల్ట్స్ డిక్లరేషన్ కూడా అదే రోజు జరిపి గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ కూడా ఇవ్వబడునని రఫీఖాన్ తెలిపారు.