సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో ఎంపీటీసీలు, టిడిపి నాయకులు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞత - అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే! * భట్టిప్రోలు ఎంపీటీసీల ఘన సత్కారం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లో గల నాలుగు ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపున కు కారణమైన మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో భట్టిప్రోలు ఎంపీటీసీలు సోమవారం ఎమ్మెల్యే ఆనందబాబు వద్దకు చేరుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సారథ్యంలో గెలిచిన ఎంపీటీసీలు గాత్రం సౌమ్యశ్రీ (ఎంపీపీ అభ్యర్థి), కత్తి కృష్ణ, మండ్రు సునీల్ బాబు, కటకం కుమారస్వామి లు, ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దుశ్యాలువా లతో చిరు సత్కారం చేశారు.
మీరు ఇచ్చిన అవకాశమే మా గెలుపు:
ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆనందబాబుకు ఎంతో రుణపడి ఉన్నామని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధిలో భట్టిప్రోలును నంబర్ వన్ చేయండి: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గెలిచిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గెలుపు కేవలం ఆరంభం మాత్రమేనని, ఇక నుంచి మండల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.మండలంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భట్టిప్రోలు మండలాన్ని నియోజకవర్గంలోనే తలమానికంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అందరితో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే ఆనందబాబు సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబాతో బాటు భట్టిప్రోలు సాగునీటి వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు డొక్కు శ్రీనివాసరావు, టిడిపి బీసీ నాయకులు డొక్కు పెద శ్రీనివాసరావు, గాత్రం లక్ష్మి- భావన్నారాయణ దంపతులు, వడ్లమూడి నాగేశ్వరరావు, మున్వర్, కోటి రత్నం బుజ్జి టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.