BREAKING
ఉచిత పశు వైద్య శిబిరాన్ని.. సద్వినియోగం చేసుకోవాలి ఉప ఖజానా కార్యాలయం' ప్రారంభించినవిప్ నాయకర్ రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావుతల్లి క్షేమమే.. బిడ్డ భవిష్యత్తుకు భరోసా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనం--ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భూ సమస్యలకు చెక్..! కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండ-ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్ వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ.

సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం

Select Suryaa Now
సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం

స్పెయిన్‌లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

సూర్య స్టేట్ బ్యూరో,అమరావతి : 

 ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేస్తూ ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా సెవిల్లెలో జరుగుతున్న ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’లో పాల్గొన్న ఆయన.. ఎక్స్‌ప్లర్జర్ సంస్థ రూపొందించిన ‘నివు ఏఐ’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకే యాత్రలో అద్భుతమైన వైవిధ్యాన్ని తిలకించేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. కేవలం సందర్శకులుగానే కాకుండా భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పర్యాటక రంగంలోనూ సాంకేతికతకు పెద్దపీట వేస్తూ స్మార్ట్ డెస్టినేషన్ల వైపు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్స్‌ప్లర్జర్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ‘నివు ఏఐ’ ఆధారిత స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. యాప్‌ల అవసరం లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా 130కు పైగా భాషల్లో పర్యాటకులు ఏపీ పర్యాటక విశేషాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్విన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో పర్యాటక ప్రాంతాలను మరింత అనుభవపూర్వకంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్‌ అడవులు, ప్రకృతి వనరుల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే వీలు కల్పిస్తున్నామని అన్నారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతికతతో ప్రపంచ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.