BREAKING
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం ఉచిత పశు వైద్య శిబిరాన్ని.. సద్వినియోగం చేసుకోవాలి ఉప ఖజానా కార్యాలయం' ప్రారంభించినవిప్ నాయకర్ రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావుతల్లి క్షేమమే.. బిడ్డ భవిష్యత్తుకు భరోసా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనం--ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భూ సమస్యలకు చెక్..! కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండ-ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్ వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం

పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Select Suryaa Now
పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం

పొదలకూరు, అక్టోబరు 7: తొలుత పుట్టింటి నుంచి దర్శనమిచ్చింది.. పుట్టింటి మమకారంతో భక్తులను అనుగ్రహించింది.. శతాబ్దాల నాటి సంప్రదాయానికి ప్రతీకగా పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి పుట్టినిల్లు అయిన నరసారెడ్డి కాలనీలోని కుమ్మరి ఇంట బుధవారం రాత్రి కొలువుదీరింది. అమ్మవారి ప్రతిమను తొలుత పుట్టింట్లోనే దర్శించుకునే అవకాశం లభించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.నరసారెడ్డి కాలనీలోని దేవరకొండ చెంచు రామయ్య అనే కుమ్మరి ఇంట అమ్మవారి మహిమాన్విత ప్రతిమను సంప్రదాయబద్ధంగా తయారు చేశారు. ప్రతిమ తయారీ పూర్తయిన అనంతరం బుధవారం రాత్రి 8:45  గంటల సమయంలో భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. అమ్మవారి ప్రతిమను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పట్టువస్త్రాలతో పుట్టింటి అలంకరణ

పొలేరమ్మ తల్లి పుట్టింటి సంప్రదాయంలో భాగంగా పెద్దకాపు మందా రామిరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ పట్టువస్త్రాలతో అమ్మవారిని అలంకరించగా.. పుష్పమాలలు, ఆభరణాలతో అమ్మవారు అపూర్వ తేజంతో విరాజిల్లారు. పచ్చని చీరలో, పూలమాలలతో అలంకరించిన అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అమ్మవారి ప్రతిమను తయారు చేసిన వెంటనే పుట్టింట్లో దర్శించుకుంటే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని, అమ్మవారి కృపతో కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. దీంతో అమ్మవారి దర్శనం కోసం రాత్రి వేళలోనూ భక్తులు బారులు తీరారు. కొబ్బరికాయలు, పూలు సమర్పించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

కుమ్మరింట్లో ప్రత్యేక ఆనవాయితీ

పోలేరమ్మ తల్లి పుట్టినిల్లు అయిన కుమ్మరి ఇంట్లో అమ్మవారిని కొలువుదీర్చే సమయంలో ప్రత్యేకమైన ఆనవాయితీని పాటిస్తారు. పుట్టింట్లో కొలువుదీరిన అమ్మవారికి కళ్లు, బుగ్గచుక్క పెట్టకపోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక తరతరాలుగా వస్తున్న విశ్వాసం ఉందని స్థానికులు చెబుతున్నారు.
పుట్టింట్లో అమ్మవారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా నెల్లూరు రోడ్డులోని శ్రీ పోలేరమ్మ మాన్యానికి తీసుకెళ్లారు.

అమ్మను చూసేందుకు.. భక్తుల పరవశం

పుట్టింటి నుంచి తొలిసారి దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి దివ్యరూపాన్ని చూసి భక్తులు పరవశించారు.“అమ్మ పుట్టింటి దర్శనం చేసుకున్నాం.. ఇక అమ్మవారి ఆశీస్సులతో మా ఇళ్లలో అంతా మంచే జరగాలి” అంటూ భక్తులు భక్తిభావంతో మొక్కులు చెల్లించుకున్నారు.
దశాబ్దాల అనంతరం వైభవంగా జరుగుతున్న పోలేరమ్మ జాతరలో భాగంగా పుట్టింటి కుమ్మరింట్లో అమ్మవారి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుట్టింటి నుంచి బయలుదేరిన అమ్మ.. ఊరంతా తిరిగి భక్తులను కటాక్షించేందుకు తరలివెళ్లిన దృశ్యం జాతర వైభవానికి ప్రతీకగా నిలిచింది.“పుట్టింటి కుమ్మరింట.. అమ్మ కొలువుదీరి.. భక్తుల గుండెల్లో భక్తితేజం నింపింది” అన్నట్టుగా ఈ అపురూప ఘట్టం భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది