BREAKING
మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు? తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు మాజీ జెడ్పీటీసీ ఏడుకొండల కుటుంబానికి మంత్రి గొట్టిపాటి పరామర్శ సాగునీరు అందించాలి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా 'గణిత దీప్తి' పుస్తకాల పంపిణీ

రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ

Select Suryaa Now
రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ


- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంతో బుధవారం మదనపల్లి మున్సిపల్ పరిధిలోని సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాల కోసం 2.98 కోట్ల రూపాయల పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతులు మీదుగా భూమిపూజ చేశారు.మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒకటి 1,2,5,24 వార్డులలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి సిసి రోడ్లు డ్రైనేజీలకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో మున్సిపల్ పరిధిలోని 5 వార్డులలో బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి భూమిపూజ చేయడం జరిగిందని,పనులు నాణ్యంగా వేగవంతంగా జరిగేందుకు స్థానిక నేతలు పర్యవేక్షించాలని కోరారు.అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలనలో పెద్దఎత్తున సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల,తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల మల్లికార్జున నాయుడు,డాన్స్ రెడ్డెప్ప,యర్రబల్లి వెంకటరమణా రెడ్డివహీదా ఆజం,రఘుపతి నాయుడు, కవిత,క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్,ఖాసిం,ఎస్సార్ షంషీర్,సహదేవ నాయుడు,జాఫరున్నిషా,కొప్పల హరినాథ్,పులి మహాలక్ష్మి,రవి నాయక్, రాధ,శశి కుమార్,చిప్పిలి గురునాథ్ యాదవ్,కమలామర్రి కృష్ణ,నవీన్ చౌదరి,మంజునాథ్,ఫిర్దోస్,పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.