BREAKING
తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు? తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు మాజీ జెడ్పీటీసీ ఏడుకొండల కుటుంబానికి మంత్రి గొట్టిపాటి పరామర్శ సాగునీరు అందించాలి

భూ సమస్యలకు చెక్..!

Select Suryaa Now
భూ సమస్యలకు చెక్..!
  • ఇమ్మామ్గూడలో రీ-సర్వే పనుల పరిశీలన
  • రైతుల భాగస్వామ్యంతో పారదర్శకంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

మహేశ్వరం మండలం ఇమ్మామ్గూడ గ్రామంలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డితో కలిసి రీ-సర్వే పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. రీ-సర్వేలో భాగంగా భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ తదితర ప్రక్రియలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే పనులు నిబంధనల ప్రకారం, పకడ్బందీగా జరుగుతున్నాయా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ నేరుగా మాట్లాడి రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భూముల హద్దులు స్పష్టత చెందడంతో భవిష్యత్తులో భూ వివాదాలు, సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు రికార్డుల విషయంలో రైతులకు స్పష్టత లభిస్తుందని అధికారులు తెలిపారు.రీ-సర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతుల సహకారం కీలకమని అధికారులు పేర్కొన్నారు. సర్వేయర్లు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు, హద్దుల సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. రైతుల భాగస్వామ్యంతో రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని, రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఎస్ఎల్ఆర్, మహేశ్వరం తహసీల్దార్, మండల సర్వేయర్, లైసెన్స్డ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)