BREAKING
ఉచిత పశు వైద్య శిబిరాన్ని.. సద్వినియోగం చేసుకోవాలి ఉప ఖజానా కార్యాలయం' ప్రారంభించినవిప్ నాయకర్ రూ.2.98 కోట్లతో సిసి రోడ్లు,డ్రైనేజీలకు భూమిపూజ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావుతల్లి క్షేమమే.. బిడ్డ భవిష్యత్తుకు భరోసా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనం--ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భూ సమస్యలకు చెక్..! కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండ-ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్ వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ.

ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్

Select Suryaa Now
ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్

  ఏలూరు, మేజర్ న్యూస్:   ఆయిల్ పామ్ పంటలో జెనోడెర్మా నిర్మూలనకు రైతులు ఉద్యానవన శాఖ సిబ్బంది సూచనలు పాటించాలని ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు సాజానాయక్ చెప్పారు.  కామవరపుకోట మండలం పాతూరు లో వేరు కుళ్ళు తెగులు నివారణ  - గెనోడెర్మా నివారణ, యాజమాన్య పద్ధతులపై  ఉద్యానవన శాఖ అధికారులు  సాజానాయక్, రామ్మోహన్ లు బుధవారం ఆయిల్ పామ్ రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సాజానాయక్ మాట్లాడుతూ  ఏలూరు జిల్లాలో 1,60,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నదని, ఇటీవల కాలంలో గెనోడెర్మా 15 సం.ల పై బడిన తోటలలో పరిశీలించడం  జరిగిందన్నారు.  గెనోడెర్మా అనేది నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రం ఏమో  ఈ శిలీంధ్రం ఆయిల్ పామ్ లో కాండం మొదలు కుళ్ళు కలుగజేస్తుందన్నారు.  ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో ఆయిల్ పామ్ చెట్లను సోకడం గమనించబడిందని,  దీని వలన రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని,. తోటల దిగుబడి తగ్గి , ఉత్పాదకత క్షీణిస్తుందని, మరియు పంట జీవిత కాలం ముప్పులో పడుతుందన్నారు.  సకాలంలో నియంత్రించకపోతే, ఇది మొత్తం తోటలను నాశనం చేస్తుందని,. అధిక వ్యాధి కలుగజేసే తీవ్రత మరియు మట్టిలో వ్యాపించే స్వభావం వల్ల దీనిని నియంత్రించడం సవాలుతో కూడిన పని అని, దీన్ని నియంత్రించడానికి, వ్యాధికారకతకు అంతర్లీనంగా ఉన్న యంత్రాంగంతో పాటు అతిధేయి మొక్క దాని పరస్పర అనుబంధం చర్య గురించి మనకు పూర్తి అవగాహన అవసరమన్నారు. వ్యాధి ప్రారంభ లక్షణాలు :గెనోడెర్మా సంక్రమణం మొదటి లక్షణాలు చెట్లు నీటి ఒత్తిడి / కరువు గురైనట్లు కనబడి మొవ్వలో నుంచి లేత ఆకులు విచ్చుకోవు. మొక్క మొవ్వ భాగంలోని పూర్తిగా ఎదగని మట్టలు చూడవచ్చు. నీటిని తీసుకోవడం పరిమితం కాబడినందున కాండం ఇప్పటికే విస్తృతంగా దెబ్బతిన్నట్లు ఇది సూచిస్తుంది. ముదిరిన చెట్లలో క్రింది మట్టలు వంగి, నిటారుగా వేలాడుతూ చెట్టుకు అతుక్కున్న భాగం నుండి విడిపోతాయి. దీని తర్వాత మొవ్వ చుట్టూ ఉన్న ఆకులు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారిపోయి కొనలు ఎండిపోతాయి.మొవ్వ మొత్తం భాగం రాలిపోవటం లేదా చెట్టు మొత్తం కూలి పడిపోవచ్చు. చాలా సార్లు, ట్రంక్ మీద తెల్లటి మైసిలియల్ పెరుగుదల కనిపిస్తుంది.తరువాతి దశలలో వేర్లు, కాండం, మొదళ్ళ కణజాలాల తగ్గుదల కూడా గమనించవచ్చు.సాధారణంగా కనిపించే లక్షణాలు :బయటి భాగం మట్టలు ఎండి, వంగిపోవటం మొవ్వ భాగంలోని ఆకులు విచ్చుకోక పోవుట జరుగును. సాధారణంగా కనిపించే చివరి లక్షణాలు : మొక్క మొదలు భాగంలో పుట్ట గొడుగులు (గెనోడెర్మా బోనిసెన్స్ శిలీంధ్ర ఫలభాగాలు), చెట్లు పడిపోవుట, చనిపోయిన, కుళ్లిపోయిన మొక్క మొదలు భాగాలు పడిపోవుట జరుగును.గెనోడేర్మా యాజమాన్య పద్దతులు : తెగులు సోకిన మొక్కను తొలి దశలోనే గుర్తించడం ద్వారా ప్రభావితమైన చెట్టును కాపాడవచ్చు. ముందస్తు నివారణ చర్యగా నేలలో ట్రైకోడెర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ను ఎఫ్ వైఎమ్ / వేపపిండి / వెర్మికంపోస్ట్ (100 కేజీలలో ఒక కేజీ /లీటర్ చొప్పున కలిపి మొక్కకు దగ్గరలో వేసుకోవడం ద్వారా తెగులు నివారించుకోవచ్చు. మొక్కలు నాటుకునే సమయంలో ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ పొడి కానీ ద్రావణం కానీ గుంటకి కేజీ చొప్పున వేసుకోవాలి. నేల మరియు పత్ర విశ్లేషణ ఆధారంగా పోషకాలను మరియు ట్రైకోడెర్మాను వేప పిండితో కలిపి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా వేసుకోవాలి. నిర్ణీత వ్యవధిలో వ్యాధులపై పరిశీలన తప్పనిసరి.1 మీ. లోతు మరియు 30 సెం.మీ. వెడల్పు ఉన్న గుంతను త్రవ్వడం ద్వారా గెనోడెర్మా సోకిన (ప్రభావిత) చెట్టును వేరుచేయండి, తద్వారా వ్యాధి సోకిన వేర్లు ఆరోగ్యకరమైన వేర్లుతో సంబంధం లేకుండా ఉంటుంది. అదే విధంగా వ్యాధి సోకిన/వ్యాధి లక్షణాలను చూపించే చెట్ల నుంచి ఆరోగ్యవంతమైన చెట్లను వేరుచేయవచ్చు.పచ్చి పశువుల పేడను వేయరాదు ఎందుకంటే ఇది వ్యాధి కలుగజేసే శిలీంద్రము యొక్క వృద్ధిని ప్రోత్సహిస్తుంది. పడిపోయిన చెట్లును మళ్ళీ నాటడం, తొలగించబడిన చెట్లు మరియు కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలు మొదలగునవి వ్యాధి కలుగజేసే శిలీంద్రము యొక్క పెరుగుదలకు, విస్తరణకు అనుకూలమైన వాతావరణంగా ఉపయోగపడుతాయి. చనిపోయిన మరియు పడిపోయిన చెట్ల కాండం, వేర్లను ముక్కలుగా చేసి కాల్చవలెను. నీటి పారుదల మరియు మల్చింగ్తో నేల సరిపడా తేమను నిర్వహించుకోవాలి.చెట్ల మొదలులో, భూమిలో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలని సాజా నాయక్ చెప్పారు.

 బ్యూరో  కే బాల సౌరి ఏలూరు జిల్లా